Home

»

Tv News

Bigg Boss 10 Telugu : సుధీర్ పై చెత్త వేసి కొట్టిన శ్రిష్టి.. వీకెండ్ లో కోటింగ్ తప్పదుగా!

Sep 23, 2026 11:21AM

బిగ్ బాస్ సీజన్ 10 మూడో వారం నామినేషన్ ప్రక్రియలో ఫుల్ హీటెట్ ఆర్గుమెంట్స్‌ జరిగాయి. కంటెస్టెంట్స్ మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. దీనిపై వీకెండ్ లో వచ్చిన నాగార్జున ఇచ్చిపడేస్తాడు. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సుధీర్ ని  శ్రిష్టి నామినేట్ చేసింది. ఒక అమ్మాయితో ఇలా ఉండడం కరెక్ట్ కాదు ఇక మన మధ్య ఏం లేదన్నానని క్లారిటీ ఇచ్చినప్పుడు ఫ్రీడమ్ దొరికింది అన్నావని శ్రిష్టి అనగానే నేను అది ఈ రకంగా అన్నాను మనం మాట్లాడుకుంటే వీళ్ళ మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు కదా ఇక వాళ్లకి ఆ ఛాన్స్ లేదు ఎవరికి ఎక్స్ ప్లెనేషన్ ఇచ్చే అవసరం లేదు.. ఇక ఫ్రీగా గేమ్ పై కన్సట్రేట్ చెయ్యొచ్చని అన్నాను. కానీ మీలాగా ఒక పదిహేను రోజుల పరిచయంతో మొహం పగులగొడతా, పళ్ళు రాలుతాయి.. ఇడియట్ అంటూ ఎవరు అనరని సుదీర్ క్లారిటీ ఇస్తాడు.

 

నన్ను రెచ్చగొట్టావ్ కాబట్టి అలా అన్నాను అందుకే సారీ చెప్పానని సృష్టి అనగానే మీ సారీ మాకు ఏం వద్దని సుధీర్ కనీసం శ్రిష్టి వంక చూసి కూడా మాట్లాడలేదు ఇక నామినేషన్ చేసి చెత్తని పోయాలని బిగ్ బాస్ చెప్పాడు.  దాంతో సుధీర్ పై సృష్టి చెత్త పోస్తుంటే చేత్తో తీసి కావాలనే తన తలపై పోస్తూ కొడుతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు.‌ మనకి చెత్త అంటుకుంటే స్నానం చేస్తే పోతుంది అంతే.. ఇది అంతే అని సుధీర్ అంటాడు.‌ అవును ఆ చెత్త నువ్వే అని శ్రిష్టి అంటుంది. ఆ తర్వాత సుధీర్ వాష్ రూమ్ దగ్గరికి వెళ్లి ఒక్కడే ఏడుస్తాడు.‌ అప్పుడే వర్షిణి అతని దగ్గరికి వస్తుంది.‌ ఇంత వరకు ఏ అమ్మాయితో నేను ఇలా మాట్లాడలేదు. ఏ అమ్మాయి ఇలా నాతో మాట్లాడలేదని ఏడుస్తాడు.

 

అది చూసి వర్షిణి బాధపడుతుంది ఆ చెత్త పొసేటప్పుడు ఆలా చెయ్యొచ్చా ఎవరైనా నాకే బాధేసిందని‌ వర్షిణి అంటుంది. ఎవరు ఏమన్నా కూడా సృష్టి చేసింది తప్పు.. ఎందుకు అంటే ఒక మనిషిని అలా కక్ష కట్టినట్లుగా చెయ్యడం రూల్స్ కి వ్యతిరేకం.. వీకెండ్ లో నాగార్జున శ్రిష్టికి గట్టిగానే క్లాస్ తీసుకుంటాడని అనిపిస్తుంది. సుధీర్ మాత్రం బాధపడుతున్నాడు.. వాళ్ల గొడవని త్రిగుణ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Nominations, Sudheer, Srushti, Varshini, Trigun, Bigg Boss Telugu Weekend, Nagarjuna, Captaincy Task]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com